హైదరాబాద్‌కి చెందిన ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ముందడుగు వేసింది. విక్రమ్-1 మూడో దశ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పవన్‌కుమార్ చందన తెలిపారు. ఈ ప్రయోగానికి ‘కలాం-100’ పేరు పెట్టినట్లు వెల్లడించారు. 10 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్ ఇంజిన్ 108 సెకన్లలో నింగిలోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ ఇదేనని వివరించారు.