• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 6 లైన్లుగా ఎల్బీనగర్-దండుమల్కాపూర్ హైవే

    హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులు త్వరలో ట్రాఫిక్ లేకుండా ఫాస్ట్ గా జర్నీ చేయనున్నారు. ఎందుకంటే త్వరలోనే ఎల్బీనగర్-దండుమల్కాపూర్ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. ఈ క్రమంలో 25 కిలోమీటర్ల వరకు రూ.600 కోట్లతో నిర్మించనున్నారు. దీంతోపాటు 8 చోట్ల ఫ్లై ఓవర్లు, సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మే నెల నుంచి పనులు జరగనున్నట్లు సమాచారం. అయితే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కోమటి రెడ్డి ఇటీవల కలిసి ఈ ప్రతిపాదన ఆలస్యం అవుతుందని తెలుపగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.