హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్ వాటర్‌బాటిల్‌కు రూ.5.50 ఎక్కవ వసూలు చేయడంతో కోర్టు రూ.55,000 జరిమానా విదించింది. సికింద్రాబాద్‌లోని లక్కీస్ బిర్యానీ హౌస్‌లో ఒక వాటర్ బాటిల్‌పై ఎంఆర్పీ దరకంటే రూ.5.50 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఒక కస్టమర్ దీనిపై ప్రశ్నించగా యజమాని బూతులు తిట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ రెస్టారెంట్‌కు కోర్టు రూ.55,000 జరిమానా విధించింది. దీంతో పాటు 10% వడ్డీ రేటుతో రూ. 5.50 రీఫండ్ చేయాలని తెలిపింది. 45 రోజుల్లోగా కోర్టుకు రూ.55,000 జరిమానాతో పాటు ఆ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి రూ.5000 ఇవ్వాలని ఆదేశించింది.
Representational Image