వర్షాకాలం వేళ భాగ్యనగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. నగరంలో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షసూచన ఉన్నందున ప్రజలు అనవసర పనులకు బయటికి వెళ్లొద్దని చెప్పారు. వర్షాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. హెల్ప్ లైన్ నంబర్ 040-21111111ను సంప్రదించాలని కోరారు. ఇప్పటికే జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపునీరు నిలిచింది. దీంతో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది.