జనసేన యువశక్తి కార్యక్రమంలో పాల్గొన్న జబర్దస్త్ నటుడు హైపర్ ఆది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. సొంత జిల్లా అయిన ప్రకాశంలోని నియోజకవర్గాల నుంచే శాసనసభ స్థానం బరిలో ఆది నిల్చుంటారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జనసేన కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దర్శి లేదా గిద్దలూరు నుంచి ఆది పోటీ చేసే అవకాశం ఉందట. గిద్దలూరులో జనసేన కాస్త బలంగా ఉంది. పైగా ఇక్కడ గతంలో ప్రజారాజ్యం పార్టీ సీటు సాధించింది. ఈ రెండు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు సామాజిక సమీకరణాల ప్రకారం, దర్శి కూడా పోటీకి అనువైనదే. ఆది ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.