తెలంగాణలో రూ.1400 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు హ్యుందాయ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు దావోస్లో మంత్రి కేటీఆర్, సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొబిలిటీ క్లస్టర్లలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ సీఈవో యంగ్చోచి పేర్కొన్నారు. హ్యుందయ్ రాకతో రాష్ట్రంలో మొబిలిటీ రంగం వైపు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.