హీరోయిన్ సమంత లాగా తానూ మయోసైటిస్ బాధితురాలినేనని నటి కల్పిక గణేష్ తెలిపారు. సమంత మూడో దశలో ఉందని, తాను మొదటి దశలో ఉన్నానని వివరించింది. 13 ఏళ్లుగా స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నానని కూడా తెలిపింది. ఒక సారి సమంతతో కలసి ఈ విషయం గురించి మాట్లాడుతానని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంది. కాగా కల్పిక ఇటీవల విడుదలైన ‘యశోద’ మూవీలో నటించింది. అంతకుముందు ‘పడి పడి లేచే మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించింది.
నేనూ మయోసైటిస్ బాధితురాలినే; నటి కల్పిక

Screengrab Instagram: kalpika ganesh