• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేను కూడా మిడిల్ క్లాసే: నిర్మల

    తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మిడిల్ క్లాస్ ప్రజల కష్టాలు తనకు తెలుసునని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగులకు కేంద్రం ఆదాయ పన్ను మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను కూడా మిడిల్ క్లాస్ మనిషినే. ఆ కష్టాలు నాకు తెలుసు. నన్ను నేను మధ్యతరగతి జీవిగానే చూసుకుంటా’ అంటూ వెల్లడించారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.