క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి అతడి తండ్రి నౌషద్ ఖాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ సచిన్ కుమారుడు అర్జున్, సర్ఫరాజ్ ఖాన్ జూనియర్ లెవెల్ నుంచి ముంబై తరఫున ఆడేవారు. ఒకరోజు సర్ఫరాజ్ వచ్చి నాన్న అర్జున్ ఎంత అదృష్టవంతుడు. ఇళ్లు, కారు, ఐపాడ్స్ అన్నీ ఉన్నాయి అన్నాడు. అప్పుడు మాట వెంట రాలేదు. కొద్దిసేపటికి వచ్చి అర్జున్ కంటే నేనే అదృష్టవంతున్ని. నా తండ్రి నాతోపాటు రోజంతా గడపుతాడు అనటంతో కన్నీళ్లు వచ్చాయి” అని తెలిపారు.