చంద్రబాబులా నేను భయపడను: మంత్రి

Courtesy Twitter:KakaniGovardhanReddy

AP: చంద్రబాబు మాదిరిగా భయపడి పారిపోనని మంత్రి కాకాణి గోవర్ధన్ వెల్లడించారు. నెల్లూరు కోర్టులో చోరీ కేసులో సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నానని ఆయన వెల్లడించారు. నీతి, నిజాయితీ ఉంది కాబట్టే సీబీఐ దర్యాప్తును వ్యతిరేకించలేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులకు అభ్యంతరం చెప్పబోనన్నారు. సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకుల నోళ్లు మూతపడుతాయని విమర్శించారు. కాగా, ఈ కేసులో మంత్రి కాకాణికి నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే.

Exit mobile version