టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న శ్రీలీల తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనలో ఒక అపరిచితుడు ఉన్నాడని చెబుతోంది ముద్దుగుమ్మ. కొన్నిసార్లు తనకు తెలియకుండానే కోపం వస్తుందట. పెద్దముక్కు ఉన్నవాళ్లు కోపిష్ఠులని, కోపం వచ్చినప్పుడు అందరిమీద అరుస్తానని చెప్పింది. “ ఎక్కువసార్లు అమ్మ మీదే అరుస్తాను. కానీ, కోపం చల్లారిన తర్వాత అమ్మను తిట్టినందుకు ఏడుస్తాను అమ్మ కనుక భరిస్తుంది. వేరేవాళ్లైతే పారిపోయేవారు” అని వెల్లడించింది.
-
Twitter:SreeLeela12 -
Twitter:SreeLeela12