తన భార్య నిద్రమత్తును భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడో భర్త. కర్ణాటకలోని బసవనగుడి పీఎస్ పరిధిలోని ఇమ్రాన్‌ఖాన్‌కు ఐదేళ్ల కిందట అయేషాతో వివాహమైంది. రాత్రి తిని పడుకుంటే మధ్యాహ్నం 12.30కి లేస్తుందని, మళ్ళీ సాయంత్రం 5.30కి పడుకుంటుందని ఇమ్రాన్ వాపోయాడు. వంటపనులు తన తల్లి చూసుకోవాల్సి వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రశ్నిస్తే తన కుటుంబ సభ్యుల చేత దాడిచేయిస్తుందని ఇమ్రాన్ ఆరోపించాడు. పెళ్లికి ముందు అయేషాకున్న వ్యాధుల గురించి చెప్పకుండా తనకిచ్చి కట్టబెట్టారని, అయేషా కుటుంబపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.