ఓ మహిళ అందరిలా విమానం ఎక్కింది. మధ్యలో కడుపునొప్పి వచ్చినట్టు అనిపిస్తే టాయ్‌లెట్‌కు వెళ్లింది. తీరా చూస్తే బిడ్డకు జన్మనిచ్చింది. తమారా అనే మహిళ ఈక్వెడార్ నుంచి ఆమ్స్టర్డామ్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఫ్లైట్‌లో ఉన్న వైద్య సిబ్బందే… ఆమెకు సహజ ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నట్లు KLM ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. శిశువుకు మాక్సిమిలియానో అని పేరు పెట్టినట్లు తెలిపింది.