• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఐ లవ్యూ అమ్మా’; ప్లేయర్ భావోద్వేగం

    తల్లిపై ఉన్న ప్రేమను ఈ ఫుట్‌బాల్ క్రీడాకారుడు వినూత్నంగా చాటుకున్నాడు. 2-0తో బెల్జియంపై మొరాకో చరిత్రాత్మకమైన విజయం అనంతరం ఈ అపురూప దృశ్యం చోటుచేసుకుంది. మొరాకో మిడ్‌ఫీల్డర్ అశ్రఫ్ హకిమి మ్యాచ్ అనంతరం తల్లి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈక్రమంలో భావోద్వేగానికి లోనై కుమారుడికి ముద్దు పెట్టింది. ‘నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన ధీర వనిత. ఐ లవ్యూ అమ్మా’ అంటూ హకిమి తన జెర్సీని విప్పి తల్లి నుదిటిపై వెచ్చని ముద్దు పెట్టాడు. తల్లీకొడుకుల అనుబంధాన్ని చూసి స్టేడియం మురిసిపోయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.