‘వార్’ సినిమా షూటింగ్ సమయంలో తాను చనిపోతానని అనుకున్నానని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ ‘వార్’ మూవీ కోసం బాడీ పర్ఫెక్షన్ కోసం తీవ్రంగా కష్టపడ్డా. సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి తీవ్రంగా అలసిపోయా. డిప్రెషన్ అంచులను తాకి వచ్చా. ఖచ్చితంగా చనిపోతానని అనుకున్నా.’’ అంటూ గుర్తు చేసుకున్నారు. కాగా ‘వార్’ సినిమా 2019లో విడుదలైంది. ఈ మూవీలో హృతిక్‌తో పాటు టైగర్ ష్రాఫ్, వాణీకపూర్‌లు నటించారు.