• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాకు వరుడు కావాలి.. కానీ

    ప్రస్తుత కాలంలో యువత పెళ్లి కోసం వింత వింత పనులు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో ఒకరు బ్రోచర్స్ పట్టుకొని నిలబడడం, ఒకరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఇలాంటివి చాలానే చూసి ఉంటాం. అలాంటి ఘటనే ఇది కూడా. ఝార్ఖండ్ హజారీబాగ్‌కు చెందిన బంగాలి దుర్గ అనే యువతి తనకు పెళ్లి కావాలని, అందుకు తగ్గ వరుడి కోసం వెతుకుతున్నానని చెప్పుకుంటూ ఓ ప్రకటన ఇచ్చుకుంది. అందులో అబద్దాలు అస్సలు చెప్పని వారు, పిసినారి తనం లేనివారు కావాలని, ఏ కులమైనా పర్వాలేదని పేర్కొంది. దీంతో పాటు కొంచెం చురుకుగా ఉండాలని, నాకంటే చిన్నవాడైనా పర్వాలేదు ఆసక్తి గల వారు సంప్రదించాలని రెండు నంబర్లు కూడా ఇచ్చింది. ఈ పోస్టర్‌ను పెళ్ళిళ్ళ ఫంక్షన్ హాళ్లలో, పత్రికలో ప్రకటన ఇవ్వడంతో వైరల్ అవుతోంది.