బళ్లారిలో తన కారుపై రాళ్లు జరిగిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సింగర్ మంగ్లీ స్పష్టం చేశారు. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఈవెంట్ అనంతరం మంగ్లీ కారుపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టేజిపై కన్నడలో మాట్లాడేందుకు మంగ్లీ నో చెప్పడంతోనే కన్నడిగులు ఇలా చేశారని పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే, అవన్నీ అవాస్తమవమని మంగ్లీ ఇన్స్టాగ్రాంలో క్లారిటీ ఇచ్చారు. తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని, కన్నడిగులు కురిపించిన ప్రేమకు పరవశం చెందానని చెప్పుకొచ్చారు. ఈవెంట్ విజయవంతంగా పూర్తైందన్నారు.
-
Screengrab Instagram: iammangli -
Screengrab Instagram: