సమంతపై తనకు ఎప్పటికీ గౌరవం అలాగే ఉంటుందని నాగచైతన్య చెప్పాడు. తాజాగా ‘లాల్‌సింగ్ చడ్డా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ విధంగా స్పందించాడు. సమంత చేసే వర్క్‌ని ఎప్పటికీ చూస్తూనే ఉంటానని అన్నాడు. మా ఇద్దరి విడాకులు పరస్పర ఒప్పందంతోనే జరిగాయి. కానీ కొంతమంది కావాలనే ఆ విషయంలో రచ్చ చేస్తున్నారు అని చెప్పాడు. అంతేకాదు తాను మళ్లీ ప్రేమలో పడటానికి సిద్దంగా ఉన్నానని మనిషికి ప్రేమ చాలా అవసరం అని అన్నాడు. కానీ సమంత మాత్రం కాఫీ విత్ కరణ్ షోలో ఇద్దరి విడాకులు అంత సులభంగా జరగలేదని, నాగచైతన్యపై చాలా కోపంగా ఉన్నట్లు మాట్లాడటం గమనార్హం. తాను ప్రస్తుతం ఎవరితో ప్రేమలో పడేందుకు సిద్ధంగా లేనట్లు ఆమె స్పష్టం చేసింది.