హైదరాబాద్లో మరో మోసం వెలుగు చూసింది. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి రూ. 20 కోట్లు వసూలు చేశాడు. జయత్రి ఇన్ఫ్రా స్ట్రక్టర్ పేరుతో ఫ్లాట్లు కట్టిస్తామంటూ డబ్బులు తీసు్నాడు. తొలుత హైదరాబాద్లోని ఖాళీ స్థలాల యజమానులతో ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం వినియోగదారులకు ఫ్లాట్లు చూపించి డబ్బులు గుంజాడు. పూర్తిగా వసూలు చేసిన తర్వాత స్థలాల యజామానులతో ఒప్పందం రద్దు చేసుకోవటంతో విషయం బయటపడింది. అతడిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.