ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని, కొన్ని రోజుల్లో చేరిక ఉంటుందని గతనెలలో జోరుగా ప్రచారం సాగింది. ఉన్నట్టుండి ఆయన పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. దీంతో పాటు బీహార్లోని అన్ని గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో అతనితో మాట్లాడిన ఓ మీడియా సంస్థ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఆయన, తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎప్పటికీ పని చేయనని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారి అందరినీ తమతో కలిసి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, వారితో ముగినిపోతానని పేర్కొన్నారు.