2022, డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో హ్యారీ బ్రూక్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్ల పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచులో సిరీస్‌ని ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేయడంలో హ్యారీ బ్రూక్‌ది కీలక పాత్ర. దూకుడైన ఆటతీరుతో మూడు టెస్టు మ్యాచుల్లో కలిపి 3 సెంచరీలు, 1 అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డునూ గెల్చుకున్నాడు.