ఇండియా -శ్రీలంక జట్ల మధ్య బెంగుళూరులోని చిన్న స్వామి స్టేడియంలో డే&నైట్ టెస్టు జరిగిన పిచ్‌కు మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ ‘బిలో యావరేజ్’ రేటింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ పిచ్ మొదటి రోజు నుంచే అనూహ్యంగా టర్న్ అయిందని తెలుపుతూ అతడు తన నివేదికను ఐసీసీకి అందజేశాడు. ఈ టెస్టులో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో లంక బ్యాట్స్మెన్లు ఒక్క సెషన్లోనే పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఈ పిచ్‌కు ఒక డీమెరిట్ పాయింట్ రానుంది.