భారత ఆల్ రౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజా ఐసీసీ ఆల్ రౌండర్ల టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మేరకు MRF టైర్స్ పురుషుల టెస్ట్ ర్యాంకింగ్స్ ను బుధవారం ICC ప్రకటించింది. మొహాలీలో శ్రీలంకతో జరిగిన టెస్టుల్లో జడేజా బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జడేజా ఆగస్ట్ 2017లో కూడా నంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్నాడు. ఇక బ్యాటింగ్లో 175 పరుగులతో 17 స్థానాలు ఎగబాకి 54వ స్థానం నుంచి 37వ స్థానానికి చేరాడు. బౌలింగ్లో 9 వికెట్లు తీసుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ జాబితాలో అశ్విన్ మూడో స్థానంలో ఉండగా, బ్యాటర్లలో కోహ్లీ-5, రోహిత్ శర్మ-6, రిషబ్ పంత్-10వ స్థానాలు కైవసం చేసుకున్నారు.
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం