మహిళల క్రికెట్‌లో 2022 సంవత్సరంలో రాణించిన వారి ఆధారంగా ఐసీసీ అత్యుత్తమ జట్టను ప్రకటించింది. ఇందులో నలుగురు భారత క్రీడాకారులకు చోటు దక్కింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ స్మృతి మందనాతో పాటు ఆల్ రౌండర్ దీప్తి శర్మ, రీచా గోష్, రేణుకా సింగ్ ఎంపికయ్యారు. గతేడాది వీళ్లు అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను మెప్పించారు. ఇక ఈ జట్టుకు న్యూజిలాండ్ క్రీడాకారిణి సోఫియా డివైన్ కెప్టెన్‌ను చేశారు. ఇండియా తర్వాత ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు.