రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఐసెట్ వెబ్ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. MBA, MCAల్లో ప్రవేశాల కోసం ఈ ప్రక్రియ జరగనుంది. ఈ నెల 15వరకు నచ్చిన కాలేజీని విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. 18న తొలిదఫా సీట్ అలాట్మెంట్ ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 231 MBA కాలేజీల్లో 20,481, 40 MCA కాలేజీల్లో 2,370 సీట్లున్నాయని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.