భారతదేశంలో అత్యంత విలువైన రెండో బ్యాంక్‌గా ఐసీఐసీఐ అవతరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.4,96,364.87 కోట్లు కాగా, HDFC రూ. 7,47,999.29 కోట్ల m-క్యాప్‌తో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు ఎస్‌బీఐ రూ.4,25,168.49 కోట్ల ఎం-క్యాప్‌తో మూడో స్థానం చేరినట్లు మింట్ నివేదిక తెలిపింది. ICICI బ్యాంక్ 2013లో m-క్యాప్ పరంగా SBIని అధిగమించింది. కొన్ని సెషన్ల తర్వాత మళ్లీ 2022 మార్చిలో SBI ఆ స్థానాన్ని తిరిగి పొందింది.