గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, రోజూ పెరుగుతున్న కేసులే దీనికి నిదర్శనమని అంతా చర్చించుకుంటున్నారు. దీనిపై ICMR ఏడీజీ సమీరన్ పాండా స్పందించారు. కొన్ని జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని దానిని పరిగణలోకి తీసుకొని ఫోర్త్ వేవ్ వస్తుందని అంచనా వేయాలని పేర్కొన్నారు. కరోనా ప్రభావం మునుపటిలా ఉండకపోవచ్చని, ప్రతి వేరియంట్ ప్రమాదకరంగా ఉండదని తెలిపారు.