ఏపీ: బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు, సాధించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన బీసీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై పవన్ ప్రశ్నించారు.