డ్రాగన్ దేశం చైనా తైవాన్ ఆక్రమణకు వేగంగా పావులు కదుపుతుంది. ఈ మేరకు చైనా సైనికులను ఆ దేశం వైపు మోహరిస్తుంది. దీంతో త్వరలోనే తైవాన్ను చైనా ఆక్రమించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. చైనా తైవాన్ను ఆక్రమిస్తే ఊరుకోమని, తమ దేశ మిలిటరీని ఆ దేశానికి పంపించి సహాయం అందిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడులకు ప్రతిఫలం ఎలా ఉందో ఒకసారి గమనించాలని, చైనాకు కూడా అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు.