రాష్ట్ర ప్రభుత్వం జీవో 111ను రద్దు చేస్తామన్న ప్రకటనను పర్యావరవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ జీవో రద్దుకు ప్రభుత్వం పూనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హైదరాబాద్ డెమెక్రసీ ఫోరం సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్రొ.కె.పురుషోత్తం రెడ్డి, డా.బీవీ సుబ్బారావు మాట్లాడుతూ.. జీవో పొడగింపు మినహా ఏ నిర్ణయానికి తాము ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను వరద నియంత్రణకు నిర్మించారని వెల్లడించారు.