జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. సీఎం పవన్ కళ్యాణ్ అనే సినిమా తీయాలని.. అవసరమైతే ఆ సినిమాకు తానే నిర్మాతగా ఉంటానని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ‘ఎలాగూ పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు. కనీసం సినిమానైనా తీస్తే అభిమానులు ఆనందపడతారు. అవసరమైతే ఆ సినిమాను నేనే నిర్మిస్తా. ఆయనప్పెడూ ఇతర పార్టీల కోసమే పనిచేస్తారు. 2014లో టీడీపీ గెలుపు కోసం, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కోసమే పోటీ చేశారు. 2024లో నైనా 175 సీట్లలో పోటీ చేయగలమని పవన్ చెప్పగలరా?’ అని అమర్నాథ్ విమర్శించారు.