హరియాణాకు చెందిన యువకుడికి ఓ మహిళ వాట్సాప్‌లో కాల్ చేసింది. కాసేపు నగ్నంగా కనిపించి కాల్ కట్ చేసింది. తర్వాతి రోజు మరో నంబర్ నుంచి వాట్సాప్ కాల్‌లో తాను ఢిల్లీ పోలీస్ అధికారినని చెప్పి.. ‘వీడియో కాల్స్ చేస్తూ మోసం చేస్తున్న మహిళా ముఠాను పట్టుకున్నాం. ఆ లిస్ట్‌లో నీ పేరు ఉంది. డబ్బులు చెల్లించూ, లేకపోతే నీపై కేసు పెడతామంటూ బెదిరించాడు. దీంతో యువకుడు రూ.5లక్షలు చెల్లించాడు. బెదిరిపులు ఎక్కువ అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.