ఇతర పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ సంతలో పశువులు మాదిరిగా కొన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడులోని చండూరు సభలో సీఎం కేసీఆర్ విమర్శలకు సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎమ్మెల్యేల భేరసారాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. శాసనసభ్యుల కొనుగోలు విషయంలో తప్పు చేయకుంటే ప్రమాణం ఎందుకు చేయలేదన్నారు. కేంద్రం ధాన్యం కొంటుంటే, కేసీఆర్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు.