వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రిన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ F3. F2 మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. సెకండ్ హాఫ్‌లో ఓ బంగ్లాలో గుప్త నిధుల కోసం వెంకీ, వరుణ్ వెతుకుతారని, వీళ్ళ రే చీకటి, నత్తిలాంటి లోపాల వల్ల అది సాధ్యంకాదు. ఆ సన్నివేశంలో కామెడీ అద్భుతంగా ఉంటుందని, ఆ సన్నివేశం సరైన విధంగా పండితే మూవీ అదిరిపొద్దని టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
F3లోని ఈ సన్నివేశం పండితే.. సినిమా దద్దరిల్లిపోతుందట
