ఆంధ్రప్రదేశ్ లోని నందిగామలో అప్పుల కోసం వచ్చిన ఏజెంట్ల కారణంగా ఇంటర్మీడియట్ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం సంచలనం రేపింది. అయితే రికవరీ ఏజెంట్లు ఇష్టారీతిన వ్యవహరించడానికి వీల్లేదు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే…

రికవరీ ఏజెంట్లు కాల్ చేసినపుడు రికార్డు చేయండి

దుర్భాషలాడితే బ్యాంకు/పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి

బ్యాంకు పట్టించుకోకుంటే అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేయాలి **నిబంధనలు**

రికవరీ ప్రక్రియ ఎప్పుడు చేపట్టేది రుణ గ్రహీతకు ముందే చెప్పాలి

రికవరీ ఏజెంట్లు ఉ. 7గం.ల నుంచి రా.7 గం.ల మధ్య మాత్రమే సంప్రదించాలి, ఉ.9గం.ల నుంచి సా. 6గం.ల మధ్య మాత్రమే వెళ్లాలి

రికవరీ ఏజెంటును ఎక్కడ కలవాలనేది రుణ గ్రహీత నిర్ణయించాలి

ఫోన్ ద్వారా కుదరనపుడు మాత్రమే ఏజెంట్లు స్నేహితులు, బంధువులను సంప్రదించాలి

రుణానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కరించే వరకూ రుణ గ్రహీత ఖాతా ఏజెంట్లకు బదిలీ చేయకూడదు