సుజీత్‌తో పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ విడుదలై కొద్ది రోజులు కూడా పూర్తికాకుండానే మరో సినిమాపై చర్చ మొదలైంది. తమిళ్ సినిమా ‘తేరి’ రీమేక్‌ని పవర్ స్టార్ చేయనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మరో రీమేక్‌లో వద్దంటూ ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ‘WeDontWantTheriRemake’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ల మోత మోగిస్తున్నారు. ఈ సినిమాను హరీశ్ శంకర్ తీయనుండటంతో డైరెక్టర్‌ను కూడా కోరుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది. అయితే, తమకు స్ట్రెయిట్ తెలుగు సినిమా కావాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తుండటంతో ఏం జరుగుతుందో చూడాలి.