అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రెండు నెలలపాటు నిద్రపోయే వాలంటీర్ల కోసం వెతుకుతోంది. ఇందుకు ఏకంగా రూ. 15 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఎంపికైన వారు 2 నెలలు కృత్రిమ గ్రావిటీలో జీవించాలి. అలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం ఉన్న తర్వాత శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంలో పరిశోధనలు చేస్తున్నారు. దీనికి ఒక షరతు కూడా ఉంది. వాలంటీర్లు జర్మన్ నేర్చుకోవాలి. ప్రత్యేక బెడ్ ఉంటుంది. ఆహారం, ఇతర కార్యక్రమాలు మంచం మీదే చేయాలి.