ఏపీ: తనకు రూ.1000 కోట్లు ఆఫర్ చేశారన్న ప్రచారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘వెయ్యి కోట్లపై మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుంది. తెలంగాణ సీఎం నాకు రూ. 1000 కోట్లు ఆఫర్ చేశారంట. ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నా. నేను మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలనా? సిద్ధాంతంతోనే మీకు దగ్గర కాగలను. నేను డబ్బుకు ఆశపడే వ్యక్తిని కాదు. అవసరమైతే ఇచ్చేవాడినే. ముస్లింలపై దాడులు జరిగినా, వారు అభద్రతకు లోనైనా భాజపా పొత్తు నుంచి బయటకు వచ్చేస్తా’ అని అన్నారు.