ఉక్రెయిన్ నాటోలో చేరుతుందనే ఉద్దేశంతో యుద్ధం ప్రకటించిన రష్యా మరో దేశానికి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఫిన్లాండ్ నాటోలో చేరేందుకు సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు సౌలి నీనిస్టో గురువారం ప్రకటించారు. ఈ అంశంపై రష్యా కొంతకాలంగా స్పందిస్తూ వస్తుంది. ఒకవేళ ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరాలనే ఉద్దేశంతో ఉంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని ప్రకటించాయి. నాటోలో చేరితే ఏమవుతుందో ముందే ఆ దేశాలకు చెప్పామని రష్యా పేర్కొంటుంది.