• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టైమ్స్ జాబితాలో IIT హైదరాబాద్..దేశంలో

    టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 తాజా జాబితాను విడుదల చేసింది. 2022 ఎడిషన్‌లో 31 దేశాలు నుంచి 616 విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. 71 యూనివర్సిటీలు అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న మూడో దేశంగా ఇండియా నిలిచింది. గతేడాది మొత్తం 62 భారతీయ సంస్థలు ర్యాంకింగ్స్‌లో పాల్గొన్నాయి. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) 42 ర్యాంక్‌ తో టాప్-50లో చోటు దక్కించుకుంది. IIT రోపర్ 68, IIT ఇండోర్ 87 ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. ఈ లిస్టులో మన IIT హైదరాబాద్ 174వ స్థానంలో నిలిచింది. చైనాలోని సింఘువా, పెకింగ్ విశ్వవిద్యాలయాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.