ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్‌పై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేసేందుకు వీలుగా ప్రామాణిక నిబంధనలను క్రికెట్ ఆస్ట్రేలియా మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా డేవిడ్ వార్నర్ స్పందించాడు. ‘నేనేమీ క్రిమినల్ని కాదు. ప్రతి ఒక్కరికి అప్పీల్ చేసుకునే హక్కు ఉంది. 2018లో జరిగింది ఒక పీడకలలా మమ్మల్ని వెంటాడుతోంది. ఆ ఘటన తర్వాత ఎంతో పశ్చాత్తాప పడ్డాను. కఠినంగా శ్రమించి జట్టులోకి మళ్లీ రాగలిగా. ఏదేమైనా కడకు నిజాయితీగా ఉండడం గురించే ఆలోచిస్తా’ అని వార్నర్ తన మనసులోని ఆక్రందనను బయట పెట్టాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ చేసి వార్నర్ బహిష్కరణకు గురయ్యాడు.
నేను క్రిమినల్ని కాదు: వార్నర్

© ANI Photo(file)