సామాజిక మాధ్యమాల్లో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై ఆయన స్పందించారు. వీడియోలో ఉంది తాను కాదని స్పష్టం చేశారు. ఎవరో వీడియోను మార్ఫింగ్ చేశారని ఎంపీ తెలిపారు. దీనిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారని తెలిపారు. తాను ఫోరెన్సిక్ పరీక్షకైనా సిద్ధమని, తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకే వీడియో చేశారని గోరంట్ల ఆరోపించారు.