భారాస అధికారంలోకి వస్తే ఉచిత కరెంటు, రైతుబంధు, దళితబంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. “ బీఆర్ఎస్ను గెలిపించుకోండి. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు రైతులకు ఉచిత కరెంటు అందిస్తాం. ఎస్సీలందరికీ దళితబంధు అమలు చేస్తాం. ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు ఇస్తాం.అందుకు రెండున్నర లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. భాజపాది ప్రైవేటీకరణ, మాది జాతీయీకరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ను మోదీ అమ్మినా…తాము అధికారంలోకి వచ్చాక విడిపిస్తాం” అని స్పష్టం చేశారు.