పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఆయనను అరెస్ట్ చేయకుండానే పాకిస్థాన్ భద్రతా దళాలు వెనుదిరిగాయి. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఇవాళ ఉదయం పోలీసులు ఆయన నివాసానికి చేరుకోగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. తాను జైలుకు వెళ్లినా ప్రజలు మాత్రం తమ హక్కుల కోసం పోరాడాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.