ఐపీఎల్ 2022లో అదరగొట్టి ఇండియన్ టీంలో చోటు సంపాదించుకున్న టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తీక్.. గ్రేట్ ఫినిషర్‌గా అదరగొడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న దినేష్.. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 392 పాయింట్లతో 87వ స్థానంలో నిలిచాడు. అటు టీమిండియా యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం అదరగొట్టాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్న అతను.. 703 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపడి 6వ స్థానానికి చేరుకున్నాడు.