దళిత బంధు పథకం కింద కరీంనగర్‌లో రూ. 38.07 కోట్లను 393 మంది షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు. 202 యూనిట్ల వాహనాలను వీరికి కేటాయించారు. వీటిలో 79 ట్రాలీ ఆటోలు, 76 హార్వెస్టర్లు, 12 జేసీబీలు, 15 మినీ లారీలు, 10 వరినాటు యంత్రాలు, 4 టిప్పర్లు, 3 మినీ బస్సులు, 2 టాటా హిటాచీలు, 1 స్కార్పియో ఉన్నాయి. పెద్ద యూనిట్లయిన జేసీబీలు, మినీలారీలు 3-4 లబ్ధిదారులు గ్రూపుగా ఏర్పడి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.