మరో 12 రోజుల్లో ‘ఫిఫా’ సమరం – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మరో 12 రోజుల్లో ‘ఫిఫా’ సమరం – YouSay Telugu

  మరో 12 రోజుల్లో ‘ఫిఫా’ సమరం

  Courtesy Instagram:fifaworldcup

  టీ20 ప్రపంచకప్ ముగిసిన వారం రోజులకే మరో ప్రపంచకప్ సందడి మొదలు కానుంది. తొలిసారిగా ఖతర్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ జరగబోతోంది. ఈ నెల 20న ప్రారంభమై వచ్చే నెల 18తో ముగుస్తుంది. ఈ 29 రోజుల వేడుకలో 32 జట్లు పాల్గొనబోతున్నాయి. ఆతిథ్యం ఇస్తున్నందున తొలిసారిగా ఖతర్ ప్రపంచకప్‌కి అర్హత సాధించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో పాల్గొన్న ఏకైక జట్టుగా బ్రెజిల్ నిలిచింది. మొత్తం 64(48గ్రూప్, 16 నాకౌట్) మ్యాచులు జరగనున్నాయి. 32 జట్లను 8 గ్రూపులుగా విభజించారు. తొలిమ్యాచ్ ఈక్వెడార్‌, ఖతర్‌ జట్ల మధ్య జరగనుంది.

  Exit mobile version