టీఆర్‌ఎస్ VS గవర్నర్ ఇష్యూలోకి మరో పార్టీ ఎంట్రీ..

© File Photo

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ VS అధికార పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు నెలకొన్నాయి. తనకు అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం విలువ కూడా ఇవ్వడం లేదంటూ గవర్నర్ కేంద్రంలోని పెద్దలకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై టీఆర్‌ఎస్ నాయకులు కూడా ఫైరయ్యారు. గవర్నర్ గవర్నర్‌లా ఉండాలని కానీ ఏదో ఒక పార్టీ ఏజెంట్‌లా వ్యవహరించడం సరికాదని కామెంట్లు చేశారు. ఇక ఇప్పుడు ఈ ఇష్యూలోకి ఏఐఎంఐ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎంట్రీ ఇచ్చారు. రాజ్‌భవన్‌లో PROగా BJP పార్టీకి చెందిన వ్యక్తిని నియమించుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అటువంటిది అసలు జరగలేదని గవర్నర్ క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version