కరోనా మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశంలో థర్డ్‌వేవ్ పూర్తిస్థాయిలో ముగియకముందే ఫోర్త్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నట్లు ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు దేశవ్యాప్తంగా ఫోర్త్ వేవ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు నెలలో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఫోర్త్ వేవ్‌లో మరో కొత్త వేరియంట్ విజృంభిస్తుందని అధ్యయనంలో వివరించారు.