ఇక జీవితాంతం సినిమా ఇండస్ట్రీలోనే ఉంటానని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. ‘ఓసారి ఇవే వేడుకలకు హాజరై దక్షిణాది హీరోల ఫొటోలు లేవని బాధపడ్డా. ఇప్పుడు ఇవే వేడుకల్లో అవార్డు పొందడం సంతోషంగా ఉంది. 45ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. అవినీతి లేని పరిశ్రమ సినీ రంగమొక్కటే. ఇక్కడ ప్రతిభే కొలమానం. రీఎంట్రీ సమయంలో కాస్త సంకోచించా. కానీ, నాపై ప్రేమాభిమానాలు చూపారు. ఇక జీవితాంతం సినిమాల్లోనే ఉంటా. యువకులు నాకు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ’ అని చిరంజీవి చెప్పారు.